ఆజాద్ మాటలు విని మోసపోయాం: టిఆర్ఎస్ కెసిఆర్

పదకొండేళ్లుగా తెలంగాణ ఉద్యమం అహింస మార్గంలోనే నడుస్తోందన్నారు. ఇకముందు అదే పంథాను కొనసాగిస్తామన్నారు. ఉద్యోగ సంఘ నేతలపై రాష్ట్ర ప్రభుత్వం హత్యాయత్నం చేయడం దారుణమన్నారు. గత 20 రోజులుగా తెలంగాణలో సమ్మె జరుగుతున్న ప్రభుత్వాలు స్పందించక పోవడం శోచనీయమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు. పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటనను గౌరవించకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. కోదండరాం నేతృత్వంలో 40 మంది ప్రతినిధులతో సోమవారం ప్రధానిని కలవనున్నట్లు చెప్పారు. కాగా కెసిఆర్ దీక్షకు గాంధీ టోపీతో రావడం విశేషం. ఈ దీక్షలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, ఉద్యోగ సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications