మేం గాజులు తొడుక్కోలేదు: డిజిపికి టి-ఎంపీలు

రైలు రోకోపై డిజిపి చేసిన హెచ్చరికలపై వారు తీవ్రంగా మండిపడ్డారు. డిజిపి పరిధి దాటుతున్నారన్నారు. పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. తాము రూలింగ్ పార్టీలో ఉండి కూడా సమ్మెలో పాల్గొనడానికి సిద్ధమయ్యామంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోవాలన్నారు. తమపై కేసులు పెట్టిన తర్వాతే ఉద్యమకారులపై పెట్టాలన్నారు. పోలీసుల తుపాకీ గుళ్లకు తామే ముందుంటామన్నారు. రైలు రోకోలో మాత్రమే కాకుండా ఇక నుండి అన్ని కార్యక్రమాలలో పాల్గొంటామని డిజిపి ఎంతమందిని బలగాలతో ఎంతమందిని అరెస్టు చేస్తారో చూస్తామన్నారు.












Click it and Unblock the Notifications