హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంచనాలను దాటిన కాంగ్రెసు అభ్యర్థి శ్రీనివాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: బాన్సువాడ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతిలో యాభైవేల ఓట్లతో ఓడిపోయిన కాంగ్రెసు అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఒంటరి పోరు చేసి ముప్పై మూడువేల పై చిలుకు ఓట్లు సాధించాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోయినప్పటికీ పరువు నిలుపుకున్నదనే చెప్పవచ్చు. తెలంగాణ కోసం సకల జనుల సమ్మె ఉధృతంగా జరుగుతున్న సమయంలో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోచారం కనీసం లక్ష ఆధిక్యంతో గెలుస్తారని అందరూ భావించారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ఎన్నికలు జరగటం ఒక అంశం అయితే సొంత పార్టీ నేతల మద్దతు లేకపోవడం ప్రధానమైన అంశం.

ఉప ఎన్నికలలో పోటికి నిలపవద్దని తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు అధిష్టానాన్ని అభ్యర్థించారు. కానీ అధిష్టానం మాత్రం పోటీకి నిలిపింది. దీంతో వారు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీనివాస్ గౌడ్‌కు మద్దతు ప్రకటించమని స్పష్టం చేశారు. ఆయనకు మద్దతుగా ఏ ఒక్క తెలంగాణ కాంగ్రెసు నేత కూడా వెళ్లి ప్రచారం చేసింది లేదు. అదే సమయంలో సమ్మెలో పాల్గొన్నారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ ఒక్కరే రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఆయనకు కేవలం స్థానిక నాయకుల మద్దతు మాత్రమే లభించింది. ఫలితాలు వెలువడిన అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉండటం, తమ పార్టీ నేతలు సహకరించక పోవడం తదితర అంశాలను పరిశీలిస్తే నైతిక విజయం తనదేనన్నారు.

English summary
Congress Party Bansuwada MLA candidate said today that moral victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X