లగడపాటికి అవకాశమిచ్చారు: కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి

కాంగ్రెసు పార్టీ 34 వేల ఓట్లు సంపాదించుకుందని అంటే ఇప్పుడు వారంతా తెలంగాణకు వ్యతిరేకమా అని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేయకపోయినా సమ్మెను ఎందుకు విరమిస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. దీనిపై కెసిఆర్, కోదండరాంలను ప్రజలు నిలదీయాలన్నారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపు అద్బుతమేమీ కాదని మరో నేత పెద్దిరెడ్డి వేరుగా అన్నారు. పోచారం గెలుపు తెలంగాణకు ఏవిధంగానూ ఉపయోగపడదన్నారు. పోచారం అసెంబ్లీకి వస్తారా లేదా ఉద్యోగుల డిమాండు మేరకు మళ్లీ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications