విరమణ దిశగా తెలంగాణ సకల జనుల సమ్మె

కాగా, తెలంగాణ టీచర్స్ జెఎసి కూడా సమ్మె విరమణ దిశగా అడుగులు వేస్తోంది. టీచర్స్ జెఎసి నాయకులు మంత్రి పార్థసారథితో చర్చలు జరిపారు. సింగరేణి కార్మికులు కూడా సమ్మె విరమణకు యాజమాన్యంతో చర్చలు ప్రారంభించారు. చర్చలు కొలిక్కి అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యోగులు కూడా సమ్మెను విరమించే అవకాశం ఉంది. రాజకీయ నేతల తీరు పట్ల తెలంగాణ ఉద్యోగుల జెఎసి నాయకుడు స్వామి గౌడ్ ఒకటి, రెండు సార్లు నిరసన వ్యక్తం చేశారు. బరువంతా తమ మీద మోపి, రాజకీయ నాయకులు డ్రామాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ స్థితిలో తెలంగాణ స్టీరింగ్ కమిటీ సోమవారం సాయంత్రం సమావేశమైంది. నవంబర్ మొదటి వారంలో తెలంగాణ మార్చ్ చేపట్టాలని జెఎసి నిర్ణయించింది. ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ప్రజాప్రతినిధులు సామూహిక ధర్నాలు చేయనున్నారు.
సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవులుగా ప్రకటిస్తే సింగరేణి కార్మికులు సమ్మెను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. కాగా, మంత్రి పార్థసారథితో చర్చలను రెండు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించాయి. టిఆర్‌టియు, డిటిఎఫ్ మంత్రితో సోమవారంనాటి చర్చలను బహిష్కరించాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications