వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిజిపి సవాల్ స్వీకరించే రోకోలో పాల్గొన్నా: రాములమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijayasanthi
హైదరాబాద్: రైలు రోకోలో పాల్గొన వద్దని డిజిపి దినేష్ రెడ్డి చేసిన హెచ్చరికలను సవాలుగా స్వీకరించే తాను రైలు రోకోలో పాల్గొన్నానని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి సోమవారం అన్నారు. తనను జీవితాంతం జైలులో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నిందన్నారు. కానీ వారి ఆటలు సాగలేదన్నారు. కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి ముందు ఎందుకు బైఠాయించడం లేదన్నారు. తెలంగాణ మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌తో రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలన్నారు. కాంగ్రెసు నేతలు డొంక తిరుగుడు కథలు చెప్పవద్దన్నారు.

తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఇతర నేతలు నిత్యం భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సిహెచ్ విద్యాసాగర్ రావు తదితర నేతలతో సమావేశమవుతున్నారని అలాంటప్పుడు తాను బిజెపి అగ్ర నేత ఎల్ కె అద్వానీ రథయాత్రలో పాల్గొంటే తప్పేమిటన్నారు. అయినప్పటికీ కెసిఆర్‌తో భేటీ అయ్యాకే యాత్రలో పాల్గొంటానని చెప్పారు. యాత్రలో పాల్గొనటం తప్పేమీ కాదన్నారు.

English summary
Medak MP Vijayasanathi said today that she took DGP Dinesh Reddy comments as challenge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X