బాబు విజయమ్మ పిటిషన్‌ను అహ్వానించాలి: బొత్స

Botsa Satyanarayana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజాజీవితంలో ఉన్నవారు అవినీతికి పాల్పడకూడదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విజయమ్మ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) నిజాయితీని నిరూపించుకోవడానికి చంద్రబాబుకు మంచి అవకాశమని ఆయన అన్నారు. విజయమ్మ పిటిషన్‌తో నిందితుడిగా చంద్రబాబును వేలెత్తి చూపించే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

తన అస్తులపై చంద్రబాబు సిబిఐ విచారణకు సిద్ధపడాలని, తద్వారా నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన సూచించారు. నిజాయితీని నిరూపించుకుంటే చంద్రబాబుకు సామాజిక కార్యకర్త అన్నా హజారే పక్కన కూర్చుకోవడానికి అర్హత సాధిస్తారని ఆయన అన్నారు. సోనియా అవినీతి ఏమిటని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఎదురు ప్రశ్న వేశారు.

చంద్రబాబును తాము లక్ష్యం చేసుకుంటున్నట్లు చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవం కాదని, తమ పార్టీ ఏ విధానమూ సిద్దాంతమూ ఉన్నాయని, అందువల్ల తాము ఎవరినీ లక్ష్యం చేసుకునే అవకాశం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్, చంద్రబాబు తిడితే తగ్గిపోవడం, ప్రశంసిస్తే పొంగిపోవడం తమ పార్టీలో లేదని ఆయన అన్నారు. తమ పార్టీ నేతలు కొంత మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోకి వెళ్తున్నారనే ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+