ఎక్కడైనా పోటీ చేస్తాం: కెసిఆర్‌కు చంద్రబాబు సవాల్

తెలంగాణ అభివృద్ధి విషయంలో ఎలాంటి చర్చకైనా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లాల్లో భూములకు రేట్లు పెరగడానికి కారణం తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధే అన్నారు. హైదరాబాదుకు ప్రపంచ పటం తెదేపా స్థానం కల్పిస్తే కాంగ్రెసు మాత్రం భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు. ఎస్‌ఈజెడ్ పేరుతో కాంగ్రెసు నేతలు భూములు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎవరెన్ని చెప్పినా టిడిపిపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెసు వాళ్లు రౌడీళ్లా ప్రవర్తించి తమ కార్యకర్తలపై దాడి చేయడం సరికాదన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు.












Click it and Unblock the Notifications