తెరాస వైపు చూస్తున్న కాంగ్రెసు ఎంపిలు, ఎమ్మెల్యేలు

తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచన సాగుతోందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. దీన్ని బట్టి తెలంగాణ ఇవ్వకపోతే తమకు ఎదురయ్యే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి తెరాసలో చేరడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంత వరకు తెలుగుదేశం పార్టీని మాత్రమే లక్ష్యం చేసుకున్న తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు కాంగ్రెసును టార్గెట్ చేస్తున్నారు. సోమవారం జరిగిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశంలో కెసిఆర్ కాంగ్రెసు పార్టీపై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం కాంగ్రెసు పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయాల్సిందేనని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం వల్ల ఇప్పటికే కొంత మంది తెరాసలోకి వచ్చారు. ఇద్దరు శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేసి, తిరిగి తెరాస తరఫున పోటీ చేసి గెలిచారు. పోచారం శ్రీనివాస రెడ్డి. చెన్నమనేని రమేష్ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి తెరాస తరఫున గెలిచారు. జోగు రామన్నవంటి వారు కూడా తెరాసలో చేరారు. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులను ఆకర్షించే పనిని కెసిఆర్ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications