హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆత్మరక్షణలో కెసిఆర్, పోలవరం టెండర్ రద్దుకు వినతి

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: పోలవరం టెండర్ వ్యవహారంలో తనపై తీవ్ర ఆరోపణలు రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆత్మరక్షణలో పడ్డట్లు కనిపిస్తున్నారు. దాంతో పోలవరం ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు. దాని ప్రతిని తెరాస కేంద్ర కార్యాలయం ఆదివారం సాయంత్రం మీడియాకు విడుదల చేసింది. ప్రాజెక్టు టెండర్లు ఇంకా ఖరారు కానందున రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

"పోలవరంపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయ్. తుది ఆదేశాలు వెలువడాల్సి ఉంది. అప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటూ కేంద్రం నిర్దేశించినట్లు నడుచుకోవాలి. భూమి, పర్యావరణం, అటవీ, పెసా చట్టాలను ఉల్లంఘిస్తున్న పోలవరం ప్రాజెక్టును మేం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే 299 గ్రామాల్లో 206 తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. మిగిలిన 23 గ్రామాలు ఛత్తీస్‌గడ్, ఒడిసా రాష్ట్రాల్లో ఉన్నాయి. ముంపునకు గురవుతున్న 1.20 లక్షల ఎకరాల భూమిలో 9,200 ఎకరాలు అటవీ భూములు. మొత్తం 1,93,357 మంది నిర్వాసితులవుతారు" ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయ డిజైన్‌లను హనుమంతరావు నేతృత్వంలోని కమిటీ రూపొందిస్తున్న తరుణంలోనే రూ.3,500 కోట్ల మొత్తాన్ని కాల్వల నిర్మాణానికి వెచ్చిస్తూ, హెడ్ వర్క్స్ నిర్మాణానికి రూ.4,717 కోట్లతో టెండర్లు పిలవడాన్ని తప్పుబట్టారు. ఈ ప్రాజెక్టును తాము మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

English summary
TRS president K Chandrasekhar Rao urged to CM Kiran Kumar Reddy to cancel Polavaram project tender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X