శిఖండిని పెట్టుకొని ఉద్యమమా?: టిటిడిపిపై ఈటెల

రాజకీయాలకు కాంట్రాక్టు రూపంను తీసుకు వచ్చిందే చంద్రబాబు అని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉన్నప్పుడు కార్యకర్తలతో ఉన్న పార్టీని కాంట్రాక్టర్ల పార్టీగా మార్చారని ఎద్దేవా చేశారు. నామా నాగేశ్వర రావు, సుజనా చౌదరి, నూకారపు సూర్య ప్రకాశ్ రావు తదితర కాంట్రాక్టర్లకు ఎంపీ సీటు ఇచ్చారన్నారు. టిఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్లేనన్నారు. పోలవరం టెండర్లపై బహిరంగ చర్చకు మేం సిద్ధమని మా చీఫ్ కె చంద్రశేఖర రావు వస్తారని చంద్రబాబును తీసుకు వస్తారా అని ప్రశ్నించారు.
తెలంగాణలో పార్టీ ఎప్పుడో కనుమరుగైందని సీమాంధ్ర ప్రాంతంలోనూ టిడిపిని దొంగలు, దుర్మార్గుల పార్టీగా అక్కడి ప్రజలు ఛీదరించుకుంటున్నారన్నారు. టిడిపికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. నాలుగు రోజులుగా ఆరోపణలు చేసిన వారిపై విజిలెన్స్‌కు లేఖ రాస్తున్నామన్నారు. వారు భేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications