ఎంఎంఎస్ స్కామ్: భర్త రేప్ చేశాడు, భార్య చిత్రీకరించింది

మజడుర గేట్‌లోని ఐటిసి భవనంలో గల విదేశీ మారక కార్యాలయంలో మహిళా సిబ్బంది కావాలంటూ ఎల్‌పి సవానీ రోడ్డువాసి జనేద్ పటేల్ వార్తాపత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. ఇంటర్వ్యూలో ఉద్యోగానికి వచ్చరకు చెందిన 23 ఏళ్ల బాధితురాలు ఎంపికైంది. ఆమెకు నెలకు 8 వేల రూపాయల వేతనం కూడా నిర్ణయించాడు.
తన కార్యాలయంలో సాఫ్ట్ డ్రింక్‌లో డ్రగ్ కలిపి దాన్ని బాధితురాలికి తాగడానికి జనేద్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను రేప్ చేశాడు. అతని భార్య దాన్ని చిత్రీకరించింది. ఆ తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే చిత్రాలను బయటపెడతామని దంపతులు ఆ అమ్మాయిని బెదిరిస్తూ వచ్చారు. ఎంఎంఎస్‌ను సర్క్యులేట్ చేయవద్దని కోరుతూ తన బంధువుల వద్ద, మిత్రుల వద్ద తీసుకుని బాధితురాలు వారికి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చింది. అంతకు మించి ఇవ్వలేనని ఆ అమ్మాయి వేడుకున్నా జునేద్ వినలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కిరాతక దంపతులను పోలీసులు ఈ నెల 24వ తేదీన అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications