సరైన సమయంలో ప్రభుత్వంపై అవిశ్వాసం: బాబు

తాను ఎవరి కార్యక్రమాలను కాపీ కొట్టలేదని ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. తమకు ఆ అవసరం లేదని, చాలా మంది తమ కార్యక్రమాలను కాపీ కొట్టారని, ప్రజల్లో చైతన్యం తేవడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. తాను ప్రభుత్వంపై అనేక విధాలుగా పోరాడుతున్నానని, ఈ ప్రభుత్వం చలించడం లేదని ఆయన అన్నారు. ఈ ఏడాది కరవు వచ్చిందని, రైతులు విపరీతంగా నష్టపోయారని ఆయన అన్నారు. రైతు సమస్యలపై శానససభలోనూ పార్లమెంటులోనూ పోరాడుతామని ఆయన అన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారేంత వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications