ఎన్టీఆర్ స్థాయిని చంద్రబాబు తగ్గిస్తున్నారా?

భవనం వెంకట్రామ్ మంత్రి ప్రమాణస్వీకారోత్సవానికి రాజభవన్ వచ్చినప్పుడు అక్కడు చూసిన రాజవైభవమే ఎన్టీఆర్‌ను రాజకీయాల వైపు నడిచిందని ఆ వ్యాసంలో రాశారు. అంతేకాకుండా, ఎన్టీ రామారావు పార్టీని స్థాపించడం వెనక ఘనతంతా చంద్రబాబు నాయుడిదేనట. తన కూతురు భువనేశ్వరిని అప్పుడు మంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఇచ్చినప్పుడే రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన ఎన్టీ రామారావుకు కలిగిందని ఆ వ్యాసంలో రాశారు. అల్లుడి రిసెప్షన్ సందర్భంగా అల్లుడి హోదా, అధికారంలో, పదవిలో ఉన్నప్పటి మజా ఎలా ఉంటుందో ఎన్టీ రామారావుకు రుచి తెలిసిందని, అప్పుడే పార్టీ పెట్టాలని ఎన్టీ రామారావు నిర్ణయించుకున్నారని ఆ వ్యాసంలో రాశారు. పార్టీ పెట్టాలనే ఆలోచనపై చంద్రబాబుతో ఎన్టీ రామారావు తరుచూ చర్చించేవారట. పార్టీని స్థాపించిన తర్వాత ఎన్టీ రామారావు ఏగబిగిన 40 వేల కిలోమీటర్లు తిరిగారని రాసిన వ్యాసంలో చైతన్య రథానికి సారథిగా వ్యవహరించిన పార్టీ ప్రస్తుత పోలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ప్రస్తావన లేదు. ఏమైనా, చంద్రబాబుకు ఘనతను అంటగట్టడానికి ఎన్టీ రామారావును తగ్గించాలనే ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది.












Click it and Unblock the Notifications