ప్రభుత్వం కూలుతుంది, తెలంగాణ ఇవ్వదు: సబ్బం హరి

Sabbam Hari
విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోని భూకేటాయింపులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సభా సంఘం వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలుతుందని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత సబ్బం హరి గురువారం అన్నారు. భూకేటాయింపులపై సభాసంఘం వేయాలనుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాం నుండి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య హయాం వరకు సభాసంఘం వేయాలన్నారు. 2004-2009 మధ్య జరిగిన నిర్ణయాలకు అప్పటి మంత్రులంతా బాద్యత వహించాలన్నారు.

వైయస్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించాలని చూస్తే ప్రభుత్వం పతనం కాక తప్పదన్నారు. కాంగ్రెసు, టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మళ్లీ ఎన్నికలకు అందరూ సిద్దపడాలన్నారు. ప్రభుత్వం ఇలాగే సమస్యలతో కొనసాగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతే అన్నారు. కేంద్రం తెలంగాణ ఇచ్చే పరిస్థితుల్లో లేదన్నారు. తనకు తెలంగాణ ప్రజలను కించపర్చాలనే ఉద్దేశ్యం లేదని అయితే పరిస్థితులను బట్టే తాను ఇలా చెబుతున్నానన్నారు.

తెలంగాణ ఇవ్వకపోతే కేంద్రం కేవలం ఆంద్రప్రదేశ్‌లో మాత్రమే సంక్షోభం ఎదుర్కొంటుంది, ఇస్తే మాత్రం దేశవ్యాప్తంగా సమస్యను ఎదుర్కొంటుందని అందుకే ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయదని తాను అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+