తెలంగాణపై రెండో ఎస్సార్సీయే?: అల్వీ ప్రకటన దుమారం

అయితే, తెలంగాణకు రెండో ఎస్సార్సీతో సంబంధం లేదని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు తెలంగాణకు వర్తించవని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమే 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించిందని ఆయన అన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు బుధవారం గుంటూరులో అన్నారు. రాష్ట్ర విభజనపై రెండో ఎస్సార్సీ వేయాలనేదే తమ పార్టీ విధానమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుకు కూడా అదే వర్తిస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు.
రషీద్ అల్వీ మాటల్లోని ఆజాద్ తెలంగాణకు సంబంధించి చూసుకుంటారని చెప్పడాన్ని బట్టి మరో రకంగా అర్థమవుతోంది. మొత్తంగా రెండో ఎస్సార్సీని వేస్తూ తెలంగాణను ప్రత్యేకిస్తారా అనేది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. కాంగ్రెసు వ్యూహాత్మకంగానే రషీద్ అల్వీ చేత ప్రకటన చేయించారని అంటున్నారు. రెండు, మూడు రోజుల్లో తెలంగాణపై ప్రకటన వెలువడుతుందని ఆజాద్ చెప్పిన తరుణంలో అల్వీ ఆ ప్రకటన చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.












Click it and Unblock the Notifications