పత్రికా వార్తను కొట్టి పారేసిన జగన్ ఎమ్మెల్యే అమర్నాథ్

Amarnath Reddy
కడప: తాను కాంగ్రెసు పార్టీలోకి తిరిగి వెళ్లనున్నట్లు వచ్చిన వార్తలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం రాజంపేట శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి శుక్రవారం కొట్టి పారేశారు. తాను కాంగ్రెసులో చేరనున్నట్లు ఓ పత్రిక ప్రచురించిందని అవన్నీ అవాస్తవాలు అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి ఎల్లో మీడియా తమపై అవాస్తవాలు రాస్తొందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోసమే వారు అలాంటి వార్తలు రాస్తున్నారన్నారు. కష్టమైనా నష్టమైనా తాను జగన్‌తోనే ఉంటానని చెప్పారు.

కాగా గురువారం జగన్ ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. పిన్నెల్లి తన రాజీనామా ఆమోదించవద్దని స్పీకర్‌ను కోరినట్లు వార్తలు వచ్చాయి. అమర్నాథ్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి కూడా స్పీకర్‌కు అదే విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ వర్గానికి చెందిన ఒక్కో ఎమ్మెల్యే జారిపోతున్నారని జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో అమర్నాథ్ రెడ్డి ఆ వార్తలను కొట్టి పారేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+