చిరంజీవిపై చిందులేసిన టిడిపి అధినేత చంద్రబాబు

రైతు సమస్యలపై ప్రభుత్వం దిగిరాకపోతే శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి కూడా వెనకాడబోనని ఆయన అన్నారు. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. చేతగాని, దద్దమ్మ ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. తిరుగుబాటు చేస్తే తప్ప రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్తు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల 39 సెజ్‌లు పెట్టి భూములను దారాదత్తం చేశారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గనులను దోచుకున్నారని, భూములను అమ్ముకున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications