జగన్‌ను దెబ్బ తీయడానికే బాబు అవిశ్వాసం మాట

అవిశ్వాసం ప్రతిపాదిస్తే ప్రభుత్వాన్ని జగన్ వర్గం కాపాడుతోందని, జగన్ కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని విమర్శించడానికి తెలుగుదేశం పార్టీ అవకాశం లభిస్తుంది. చంద్రబాబు మీద వైయస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ వేయడం వెనక కాంగ్రెసు హస్తం ఉందని, జగన్ కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే అలా చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. తాము అవిశ్వాసం ప్రతిపాదిస్తే జగన్ వర్గం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే తాము చేస్తున్న వాదనకు బలం చేకూరి తమకు రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు చెబుతున్నారు. అయితే, తెరాస శాసనసభ్యులు కలిసికట్టుగా పార్టీ వైఖరికి కట్టుబడి వ్యవహరించిన సందర్భాలు లేవు. ఈ స్థితిలో అవిశ్వాసం ప్రతిపాదిస్తే కొంత మంది తెరాస శాసనసభ్యులు పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది. అదే జరిగితే తెరాసను కూడా ఎండగట్టడానికి వీలవుతుందని, ప్రభుత్వాన్ని కాపాడేది తెరాస, జగన్ వర్గం మాత్రమేనని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి వీలవుతుందని తెలుగుదేశం పార్టీ విశ్వసిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను మళ్లీ తెర మీదికి తెచ్చారు.












Click it and Unblock the Notifications