తెలంగాణ రెండో ఎస్సార్సీ పరిధిలోకి రాదు: రషీద్ అల్వీ

ఉత్తరప్రదేశ్ విభజన, ఇతర చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లపై రెండో ఎస్సార్సీ వేయాలనేదే తమ పార్టీ విధానమని, తెలంగాణ అంశాన్ని మాత్రం ఎస్సార్సీతో ముడిపెట్టలేమని అల్వీ అన్నారు. యుపి విభజనను ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి రాజకీయ జిమ్మిక్కుతో ముందుకు తెచ్చారని ఆయన విమర్శించారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధిని కాకుండా విభజన అంశాన్ని ముందుకు తెచ్చి రాజకీయం చేయడం, దాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చడం సరైంది కాదని ఆయన అన్నారు. భాష, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఇందుకు రెండో ఎస్సార్సీ వేసి అధ్యయనం చేయించడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications