గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా, అందుకే ఆ మాటలా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: కాంగ్రెసును ఎదిరించి రావడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంతర్మథనం పడుతున్నారా అని అనిపిస్తోంది. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని పెట్టి తప్పు చేశానని ఆయన భావిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన గుంటూరు ఓదార్పు సభలో సోమవారం మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అలా అనిపిస్తోంది. రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్రమైన చిక్కుల్లో పడిన జగన్ కాంగ్రెసు నుంచి బయటకు రాకుండా ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కావని భావిస్తున్నారు. నల్ల కాలువలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం వల్లనే తనకు ఇన్ని కష్టాలు వచ్చాయని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానికి దిగ్భ్రాంతికి గురై హఠాన్మరణం చెందినవారి కుటుంబాలను పరామర్శిస్తానని ఆయన నల్లుకాలువ సభలో చెప్పారు. అందులో భాగంగానే ఆయన ఓదార్పు యాత్రలు చేస్తున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోయి అంతర్మథనంలో పడి ఆయన అలా మాట్లాడారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓదార్పు యాత్రను ఢిల్లీ పెద్దలు వద్దన్నారని, దానివల్లనే కాంగ్రెసు నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పార్టీ నుంచి బయటకు రావడం వల్లనే తనపై సిబిఐ విచారణ జరుగుతోందని ఆయన అన్నారు.

నల్లకాలువలో ఇచ్చిన మాటకు కట్టబడి ఉండకపోతే తనకు మంత్రి పదవి కూడా ఇచ్చేవారేమోనని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఇంకా జీవించి ఉన్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దేశానికి వైయస్సార్ చాటి చెప్పారని ఆయన అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైయస్ రాజశేఖర రెడ్డిదేనని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెసు పార్టీపై దూకుడుగా వ్యాఖ్యలు చేసిన జగన్ దాన్ని తగ్గించినట్లే కనిపిస్తున్నారు. గతంలో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై కూడా ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ తర్వాత కాస్తా వెనక్కి తగ్గినట్లే కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వ్యక్తిగతంగా సిబిఐ, ఈడిల విచారణను ఎదుర్కోవాల్సి రావడం, రాజకీయంగా తన వెంట వస్తారని భావించిన శాసనసభ్యులు జారుకుంటుండడం ఆయనను మనస్తాపానికి గురి చేసి ఉంటాయని అంటున్నారు.

English summary
According to political analysts YSR Congress party president YS Jagan has loosing temperment in political war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X