యువతులను మోసం చేసిన సినీ రైటర్ కొడుకు అరెస్టు

Kurnool District
కర్నూలు: సినిమాల్లో అవకాశం కల్పిస్తామని మోసం చేస్తున్న ఓ ముఠాను కర్నూలు జిల్లా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో ప్రముఖ రచయిత మరుధూరి రాజా తనయుడు సాయి కిషోర్ కూడా ఉన్నారు. ఇతనితో పాటు శశికాంత్, సందీప్, దిలీప్, కవితలను పోలీసులు అరెస్టు చేశారు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని కర్నూలు, హైదరాబాదుకు చెందిన ముగ్గురు యువతులను వీరు మోసం చేశారు.

బాధితుల నుండి వీరు నగలు, డబ్బు తీసుకున్నారు. అరెస్టు అనంతరం పోలీసులు వారి నుండి ఆరు లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిని విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+