శంకరరావు నాన్ స్టాప్ దూకుడు, మళ్లీ వ్యాఖ్యలు

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కాంగ్రెసు పార్టీ అధినేత సోనియా గాంధీ దృష్టిలో ఉన్నాయని ఆయన అన్నారు. పనులు జరగకపోతే ఇబ్బంది పస్తుందనే ఉద్దేశంతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో ప్రభుత్వ వాటా పెంచడం స్వాగతించదగిన పరిణామమని ఆయన అన్నారు. దీనివల్ల వేయి కోట్ల ప్రజాధనం ప్రభుత్వానికి సమకూరుతుందని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఆ వ్యవహారంపై విచారణ జరగాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం టెండర్ల విషయంలో పట్టింపులకు వెళ్లరాదని, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications