మేము మీకు మీరు మాకు!: టిడిపికి కెటిఆర్ మెలిక

KT Rama Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు అవిశ్వాసంపై టిడిపికి మెలిక పెట్టారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా పని చేస్తున్నందున టిడిపి అవిశ్వాస తీర్మానానికి మేం సంపూర్ణ మద్దతు ఇస్తామని అయితే టిడిపి కూడా తెలంగాణపై తీర్మానానికి తమకు మద్దతివ్వాలని మెలిక పెట్టారు. ప్రభుత్వం పడిపోవడం కేవలం తమపై ఆధారపడి లేదని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేల వైఖరిపై కూడా ఆధారపడి ఉందన్నారు. టి-కాంగ్రెసు ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసానికి మద్దతివ్వాలని డిమాండ్ చేశారు.

నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని సిపిఐ ఎమ్మెల్యే గూండా మల్లేష్ అన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణను కరవు ప్రాంతంగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందన్నారు. యుపి సిఎం మాయావతిని చూసి కిరణ్ కుమార్ ప్రభుత్వం నేర్చుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం స్వాతంత్ర్య పోరాటం కన్నా ఎక్కవగా ఉందన్నారు. తెలంగాణపై ప్రజలకిచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని బిజెపి ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.

తీర్మానాలతో సమయం వృథా తప్ప ఏమీ ఉండదని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. కాగా సిపిఎం 104, 108 సర్వీసులపై వాయిదా తీర్మానం ఇవ్వగా, బిజెపి, టిఆర్ఎస్, సిపిఐ తెలంగాణపై ఇచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+