చిరు తర్జన భర్జన, ప్రాధాన్యం లేదంటున్న ఎమ్మెల్యేలు

రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోకుండా మనం ఆదుకుంటున్నప్పటికీ కాంగ్రెసు మాత్రం మనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అలాంటి ప్రభుత్వాన్ని కాపాడటానికి విప్ జారీ చేయాల్సిన అవసరం ఏమిటని కొందరు చిరుని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. మనకు కాంగ్రెసు సరియైన ప్రాధాన్యం ఇచ్చి ఉంటే విప్ జారీ చేసినా బాగుండేదని కానీ పిఆర్పీని విలీనం చేసి ఆరు నెలలు దాటినా కనీసం మీకు కూడా ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇవ్వలేదని ఎమ్మెల్యేలు చిరుతో ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇంత ప్రజాభిమానం కలిగి ఆపత్కాలంలో అదుకున్న మీ పరిస్థితే ఇప్పుడు ఇలా ఉంటే తర్వాత్తర్వాత ఎలా ఉంటుందోనని పలువురు ఎమ్మెల్యేలు చిరంజీవితో అనుమానం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వ్యక్తిగతంగా విప్ జారీ చేయాలని భావిస్తున్న చిరంజీవి వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications