జగన్ ఎమ్మెల్యేలపై వేటుకు రెడీ, బొత్సకు ఆజాద్ పిలుపు

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసి విప్‌ను ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన 16 మంది శాసనసభ్యులపై వేటుకు కాంగ్రెసు అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ఈ విషయమై సమగ్రంగా చర్చించడానికి రావలసిందిగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టుపై గెలిచి వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్ పక్షం వ హించిన శాసనసభ్యులు అవిశ్వాస తీర్మానం విషయంలో కాంగ్రెస్ పార్టీ జారీ ఇచ్చిన విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం క్రమశిక్షణా రాహిత్యమేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే, వారిపై అనర్హత వేటుకు కాంగ్రెసు సిద్ధపడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆజాద్‌తో చర్చించిన అనంతరం పిసిసిఈ వ్యవహారంలో తగిన చర్య తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారి బుధవారం ఉదయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాయంత్రానికల్లా ఆజాద్ నుంచి బొత్సకు పిలుపు వచ్చింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రతిపక్షం ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన ఆ 16 మంది ఎమ్మెల్యేల పైనా అనర్హత వేటు వేయవలసిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు కేంద్ర మంత్రి ఆంటోనీకి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని ఆంటోనీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే జగన్ వ ర్గీయులపై చర్య తీసుకునేముందు మరి కొంత వ్యవధి ఇచ్చి చూస్తే మంచిదని మంత్రి శంకరరావు బుధవారంనాడు పేర్కొన్నారు.

దమ్ముంటే అందరినీ ఒక్క సారే అనర్హులుగా ప్రకటించండి అని వైయస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారంనాడు సవాలు చేయగా, ఆయన తమకేమీ సలహాలు ఇవ్వనక్కరలేదని, ఎప్పుడు ఏ చర్య ఎవరిపై తీసుకోవాలో బాగా తెలుసునని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అప్పుడే సమాధానం చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+