చంద్రబాబు, వైయస్ జగన్‌లపై బొత్స ఎదురు దాడి

మైలవరం కల్తీ సారా ఘటనలో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు విజయబాబు అనుచరులని, విజయబాబు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు అనుచరుడని ఆయన అన్నారు. విచారణ జరిగితే ఏ పార్టీవారు కల్తీ సారా ఘటనకు బాధ్యులో తెలుస్తుందని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కల్తీ సారా ఘటనను చంద్రబాబు వాడుకుంటున్నారని ఆయన అన్నారు.
ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ధర్నా చేయడాన్ని ఆయన విమర్శించారు. ధర్నాలు చేయడం వంటి చౌకబారు ఆలోచనలు వైయస్ జగన్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ విడుదల చేశామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం సోనియా నాయకత్వంలోని తమ నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని, దాన్ని అమలు చేసి తీరుతామని, అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications