కోదండరామ్! తెరాసలో చేరు: కడియం శ్రీహరి

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాలకుర్తి సభను చూసైనా తెరాస నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెరాస, తెలంగాణ జెఎసి రెచ్చగొట్టి సాధించిందేమిటని, విద్యార్థులూ యువకులపై కేసులు పెట్టించారని ఆయన అన్నారు. దమ్ముంటే తెలంగాణ అభివృద్ధిపై తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. చంద్రబాబు పర్యటన విజయంతోనైనా తెరాస, తెలంగాణ జెఎసిల్లో మార్పు రావాలని ఆయన అన్నారు. బాధ్యత గుర్తించి తెరాస తెలంగాణ సమస్యల పరిష్కారానికి పాటు పడాలని ఆయన సూచించారు.
తెలంగాణ ఉద్యమంతో శాసనసభ్యులను గెలిపించుకుని అవసరమైనప్పుడు కెసిఆర్ అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీని విమర్శించే హక్కు తెరాసకు లేదని ఆయన అన్నారు. ఏం త్యాగాలు చేశారని కెసిఆర్ కుటుంబ సభ్యులు పదవులు అనుభవిస్తున్నారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications