పుట్టపర్తిలో సింగపూర్ భక్తుడి మృతి, అతను ఎన్నారై

Anantapur District
అనంతపురం: సింగపూర్‌కు చెందిన 55 ఏళ్ల సాయిబాబా భక్తుడు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మరణించాడు. తమిళనాడుకు చెందిన షణ్ముఖ అమృత లింగం అనే ఆ భక్తుడు కొన్నేళ్ల క్రితం సింగపూర్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. పుట్టపర్తిలోని ఓ అనుమానాస్పద స్థితిలో అతను సోమవారం మరణించి కనిపించాడు. పుట్టపర్తికి షణ్ముఖ లింగం తరుచుగా వస్తుంటాడని పుట్టపర్తి డిఎస్పీ కెసి వెంకటయ్య చెప్పారు. ఈసారి అక్టోబర్ 21వ తేదీన అతను టూరిస్టు వీసాపై పుట్టపర్తికి వచ్చాడు.

అతను సాయి టవర్స్ అపార్టుమెంటులోని 23వ నెంబరు గదిలో ఉంటున్నాడు. గత మూడు రోజులుగా అతను గది నుంచి బయటకు రాలేదని తెలుస్తోంది. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో ఆపార్టుమెంటు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అపార్టుమెంటు తలుపులు పగులగొట్టి తెరిచారు. షణ్ముఖం శవం మంచంపై పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+