కొత్త ఎమ్మెల్యేల శిక్షణలో చిరంజీవి: ఫ్యాన్స్ సందడి

కార్యక్రమం సందర్భంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఎమ్మెల్యేలంటే నియోజకవర్గానికే పరిమితం కావాలని లేదని, పరిధిని విస్తరించుకోవాలని, సేవా దృక్పథం అలవర్చుకోవాలని, ర్రాష్టానికి, దేశానికి కొంత సమయం వెచ్చించాలని, ప్రభుత్వం అంటే సచివాలయం మాత్రమే కాదని, మనం కూడా అందులో భాగమేనని సూచించారు. జట్టుగా స్ఫూర్తితో పని చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదని, దేశాభివృద్ధికి అందరం కలిసి పాటుపడాలని చెప్పారు. ఎమ్మెల్యేలకు విజన్ ముఖ్యమని, దూరదృష్టి ఉంటే ఎన్నో అభివృద్ధి పనులకు ఇప్పుడే బాటలు వేయగలుగుతామని చెప్పారు.
రాష్ట్రంలో సగం మంది ఎమ్మెల్యేలు ఒక ప్రాంతం సమస్యలపై అధ్యయనం చేయడానికి వెళ్లడం, అక్కడి ప్రజలతో మమేకమై, వారి ఇబ్బందులు తెలుసుకుని, పరిష్కరించడానికి ప్రణాళికలు రూపొందించడం శాసనసభ చరిత్రలో ఇదే ప్రథమమని ప్రకటించారు. కొందరు ఆరోపిస్తున్నట్టు సేద తీరడానికో, సరదాలు తీర్చుకోవడానికో ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు. ఇలాంటి సదస్సు దేశంలోనే కాదు, కామన్ వెల్త్ దేశాల్లోనూ ఎక్కడా జరగలేదన్నారు.












Click it and Unblock the Notifications