మోత్కుపల్లి నర్సింహులుపై తెరాస కార్యకర్తల దాడి

మోత్కూరు గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఆ చేదు అనుభవం ఎదురైంది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన తెరాస కార్యకర్తలు మోత్కుపల్లిపై దాడి చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌ను విమర్శిస్తే సహించేది లేదని తెరాస కార్యకర్తలు అన్నారు. కెసిఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు మోత్కుపల్లిని డిమాండ్ చేశారు. మోత్కుపల్లి నర్సింహులు నల్లగొండ జిల్లాకు చెందినవారే. ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కాగా, ఆయన స్వగ్రామం ఆలేరు శాసనసభా నియోజకవర్గంలోని పారుపల్లి.












Click it and Unblock the Notifications