మంత్రి కన్నా తనయుడిని ప్రశ్నించిన అధికారులు

కస్టమ్స్ డ్యూటీ, పెనాల్టీ చెల్లిస్తామని వారి నుంచి అధికారులు రాతపూర్వకమైన హామీ తీసుకుని వారిని వదిలేశారు. శుక్రవారం తమ ముందు హాజరు కావాలని వారికి సమన్లు జారీ చేశారు. పర్యటనను స్పాన్సర్ చేసినవారు వారికి స్కాచ్, వాచీలు బహుమతిగా ఇచ్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వస్తువులు కొనుగోలు చేయడానికి వీరు పెద్ద యెత్తున డబ్బును భారత్ నుంచి తీసుకెళ్లారా అనే విషయంపై ఆరా తీస్తున్నామని, యుకెలోని మిత్రులు, బంధువులు తమకు ఆ సరుకులు ఇచ్చారని వారు చెప్పారని అధికారులు చెబుతున్నారు.
నలుగురిలో ఇద్దరు తరుచుగా లండన్, దుబాయ్ వంటి విదేశాలకు తిరుగుతున్నట్లు తమ విచారణలో తేలిందని అధికారులు అంటున్నారు. గత పర్యటనల సందర్భంగా కూడా వస్తువులను స్మగుల్ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అక్రమంగా తరలించిన సరుకుల కస్టమ్స్ డ్యూటీ 14 లక్షల రూపాయలు, పెనాల్టీ 16 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications