ఇదేనా చిరంజీవి మార్క్ సామాజిక న్యాయం?: టిడిపి

ప్రభుత్వంలోని పెద్దల అవినీతి, అక్రమాలు, వైఫల్యాల వల్ల విద్యుత్ సంస్థలు పదివేల కోట్లు నష్టపోయాయని మరో నేత మైసూరా రెడ్డి వేరుగా ఆరోపించారు. జెన్‌కో ప్లాంట్ల నిర్మాణ అంచనాలను భారీగా పెంచేసి మూడువేల కోట్లు, రైతులకోసం అధిక ధరకు కొన్న విద్యుత్‌ను పరిశ్రమలకు అక్రమంగా సరఫరా చేయడం ద్వారా మరో రెండువేల కోట్లు, ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు గ్యాస్‌ను తరలించేసి ఐదువేల కోట్ల దాకా తినేశారని ధ్వజమెత్తారు. ఈ నష్టాన్ని ప్రజల నుంచి వసూలు చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ మాదిరిగా తయారైందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications