ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన పిఆర్పీ మంత్రుల శాఖలు

C Ramachandraiah-Ganta Srinivas Rao
హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గానికి చెందిన మంత్రులు సి.రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులకు ఎట్టకేలకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. రామచంద్రయ్యకు దేవాదాయ, గంటాకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఓడరేవులు శాఖలను కేటాయించారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రామచంద్రయ్య, గంటాలు భేటీ అయ్యారు. వారు విద్యుత్, వాణిజ్య శాఖలకు పట్టుబడినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉదయం సిఎంతో భేటీ ఐన తర్వాత తీవ్ర తర్జనభర్జన అనంతరం సిఎం కేటాయించిన శాఖలకు వారు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. గురువారం రాత్రి చిరంజీవి, సిఎంతో భేటీ అయి శాఖలపై చర్చించిన విషయం తెలిసిందే. సిఎంతో భేటీ తర్వాత కొత్త మంత్రులతో చిరంజీవి అప్పుడే భేటీ అయ్యారు.

అప్పటికీ శాఖల కేటాయింపు ఓ కొలిక్కి రాలేదు. ఉదయం మంత్రులతో సిఎం భేటీ ద్వారా శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కాగా గురువారం ఉదయం గం.11.43 నిమిషాలకు వీరిద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరిలో రామచంద్రయ్య టిడిపి హయాంలో మంత్రిగా చేశారు. గంటా శ్రీనివాస రావు మంత్రి బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+