అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం, మళ్లీ తూర్పులోనే ఘటన

అంబేద్కర్‌కు జరిగిన అవమానానికి నిరసనగా దళిత నాయకులు, అంబేద్కర్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సాగునీటి కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బస్సులపై రాళ్లు రువ్వారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత రాజ్యమేలుతోంది. వరుసగా విగ్రహాల ధ్వంసం ఘటనల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు కాపలా ఉండాల్సిందిగా వీఆర్‌వోలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
తమ పరిధిలోని అంబేద్కర్ విగ్రహాలపై నిఘా ఉంచాలంటూ పోలీసులకూ ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులపాటు రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్, ఎస్పీలు ఆదేశించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ రంగంలోకి దిగాయి. ఆందోళనకారులు 16వ నెంబరు జాతీయ రహదారిని దిగ్భందించారు. దీంతో 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. అంబేద్కర్ విగ్రహ ధ్వంసం విషయాన్ని ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ హోం మంత్రికి ఫోన్‌లో తెలియజేశారు. నిందితులను 48 గంటల్లో పట్టుకుంటామని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలో కాంస్య విగ్రహం ఏర్పాటు విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని ఎమ్మెల్సీ దుర్గేష్, ఎస్పీ ఉమాపతి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.












Click it and Unblock the Notifications