రెండు నెలలుగా సునీల్ తప్పించుకుంటున్నాడు: సిబిఐ

కాగా అంతకుముందు రెండు నెలలుగా సునీల్ తప్పించుకు తిరుగుతున్నారని, ఎమ్మార్‌లో అక్రమగా వసూలైన డబ్బులు ఎక్కడ దాచారో తెలుసుకునేందుకు ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సిబిఐ న్యాయస్థానాన్ని కోరింది. సునీల్ రెడ్డి నుండి డబ్బు పొందిన అసలు వ్యక్తిని గుర్తించాల్సిన అవసరముందన్నారు. ఆ డబ్బు ఎక్కడ దాచారో సునీల్‌కు తెలుసునని చెప్పారు. ఛార్జీషీట్‌కు సమయం దగ్గర పడుతున్నందు వల్ల లోతుగా విచారించేందుకు సునీల్‌ను తమ కస్టడీకి ఇస్తే గుట్టు బయట పడుతుందన్నారు. అయితే సిబిఐ వాదనను సునీల్ తరఫు న్యాయవాది తప్పు పట్టారు. ఎమ్మార్ కేసులో రంగారావు, కోనేరు ప్రసాద్‌లను కాపాడేందుకు సిబిఐ ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఉద్దేశ్య పూర్వకంగానే రంగారావు పేరును తొలగించారన్నారు. వారిద్దరూ సునీల్‌కు డబ్బులిచ్చారనడానికి ఆధారాలు లేవన్నారు. కాగా సునీల్ రెడ్డిని స్పెషల్ క్లాస్ ఖైదీగా గుర్తించాలని పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications