వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంపై రోశయ్య విమర్శ, తమిళ అసెంబ్లీలో స్పీచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. తమిళనాడు పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆయన తమిళనాడు శాసనసభలో తొలిసారి సోమవారం ప్రసంగం చేశారు. ముల్లపెరియార్ డ్యామ్ వివాదంలో తాము రాజీ పడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తూ కేరళ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. డ్యామ్ భద్రత విషయంలో తాము హామీ ఇస్తామనే దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి ఆయన వివరించారు. తమిళనాడు గవర్నర్‌గా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత శాసనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం ఇదే మొదటిసారి.

సంకుచిత దృష్టితో కూడిన రాజకీయ ప్రయోజనాలను ఆశించి ముల్లపెరియార్ డ్యామ్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోనట్లు వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలతో సామర్యవూర్వకంగా వ్యవహరించాలని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముల్లపెరియార్ డ్యామ్‌కు సంబంధించిన సంఘటనల విషయంలో తాము సహనంతో వ్యవహరించామని ఆయన చెప్పారు. ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కేరళ ప్రజలను కోరారు.

English summary
In his maiden assembly address in Tamil Nadu, Governor K Rosaiah said, "This government is committed to maintaining cordial relationships with all our neighbouring states. Tamil Nadu has often been the victim of false and parochial campaigns launched with short sighted political interests and the persistent indifference of the Union Government".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X