నేడే విస్తరణ: ముగ్గురికి ఛాన్స్, తెర పైకి కొత్తగా డిఎస్ పేరు

D Srinivas-Uttam Kuamr
హైదరాబాద్: మంత్రి వర్గ విస్తరణ సోమవారమే జరగనుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలకు అధిష్టానం అనుమతిచ్చిందన్న నేపథ్యంలో ముగ్గురికి కేబినెట్లో చోటు దక్కే అవకాశముందని జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముగ్గురితో ఈ రోజు సాయంత్రం విస్తరణ చేయనున్నారు. సాయంత్రం గం.6.28 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రాజ్ భవన్‌కు జిఏడి సమాచారం కూడా అందించినట్లుగా తెలుస్తోంది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. రెండో పేరు పైనే తర్జన భర్జన కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రసాద్ కుమార్, చీప్ విప్ మల్లు భట్టి విక్రమార్క పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన గండ్ర వెంకట రమణా రెడ్డి పేరు చివరి వరకు వినిపించినప్పటికీ ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా ఉండటం, కోమటిరెడ్డి స్థానంలో అదే జిల్లాకు చెందిన ఉత్తమ్‌ను తీసుకోవడంతో గండ్రకు అవకాశం దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే విషయాన్ని సిఎం గండ్రతో చెప్పారని సమాచారం.

మరోవైపు శాసనమండలి సభ్యుడు, పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ పేరు తాజాగా తెర పైకి వస్తోంది. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పలువురు సిఎం దృష్టికి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఇతర నేతలతో భేటీ అనంతరం సిఎం పేర్లు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మూడో మంత్రి పదవికి కూడా అధిష్టానం అనుమతిచ్చిందని, అది కోస్తా నుండి భర్తీ చేయవచ్చుననే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ చీప్ విప్ కొండ్రు మురళిని ఇది దక్కే అవకాశముంది. మంత్రుల శాఖల మార్పుల పైనా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రసాద్ కుమార్, కోస్తా నుండి కొండ్రుకు అంతిమంగా ఛాన్స్ ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+