ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా తెలంగాణపై మొండి వైఖరి వీడాలి: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
అదిలాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇప్పటికైనా తమ మొండి వైఖరి వీడి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం డిమాండ్ చేశారు. ఆయన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల సహనాన్ని పరీక్షిస్తే కేంద్రానికి పుట్టగతులుండవని హెచ్చరించారు. ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా కేంద్రం మొద్దు నిద్రపోతున్నదని విమర్శించారు. ఆ తోలు మందం, గుడ్డి, చెవిటి, మూగ సర్కారును కట్టెలందుకొని దంచితేనే దాని రోగం తిరుగుతుందంటూ మండిపడ్డారు. చంద్రబాబు 2009లో తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్నికల పొత్తు పెట్టుకొని ప్రస్తుతం అడ్డంకిగా మారాడన్నారు.

రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు, ఉద్యోగులు, కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన చేస్తుంటే కిరణ్ సర్కారు మొద్దు నిద్రపోతోందని దుయ్యబట్టారు. లక్ష ఉద్యోగాలిస్తామని సిఎం పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నా, అవి డూప్లికేట్ అన్న భావనతోనే ప్రధాని ఆ కార్యక్రమానికి హాజరు కాలేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తోందని తెలంగాణ ఏర్పడ్డాక ఒకే ఒక్క సంతకంతో అందర్నీ రెగ్యులరైజ్ చేసి, వారి కన్నీరు తుడుస్తామని హామీ ఇచ్చారు. అలాగే గిరిజనులు, మైనారిటీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు ప్రకటించడంతోపాటు ఉప ముఖ్యమంత్రి పదవిని మైనారిటీలకు ఇస్తామని చెప్పారు. మార్చి నెల తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పునరుద్ఘాటించారు.

English summary
TRS chief K Chandrasekhar Rao suggested AICC president Sonia Gandhi about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X