బళ్లారిలో అక్రమ తవ్వకాలు నిజమే: సాధికారిక కమిటీ

Bellary Mining
న్యూఢిల్లీ: బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరిగాయని సాధికారిక కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు తుది నివేదికను అందజేసింది. కర్నాటకలో అక్రమ మైనింగ్‌పై విచారణకు సాధికారిక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ రోజు తమ తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. అక్రమ తవ్వకాలు నిజమేనని ఆ నివేదికలో కమిటీ తెలిపింది. అక్రమ తవ్వకాలు జరిపిన వారికి భారీగా జరిమానా విధించాలని సూచించింది. సిబిఐ సిఫార్సుల మేరకు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పేర్కౌంది. పరిధి దాటి తవ్వకాలు జరిపిన వారికి హెక్టారుకు రూ.5 కోట్ల జరిమానా, అక్రమంగా రోడ్లు వేసిన వారికి, ఖనిజ నిల్వలు చేసిన వారికి రూ.ఒక కోటి రూపాయల వరకు జరిమానా విధించవచ్చునని సూచించింది. బళ్లారిలో 83, చిత్రదుర్గలో 16, తుంకూరులో 24 అక్రమ మైనింగ్‌లను గుర్తించినట్లు తెలిపింది. మొత్తం 123 అక్రమ మైనింగ్‌లు ఉన్నాయని, వాటి లైసెన్సులు రద్దు చేయాలని సూచించింది.

ఆంధ్రా - కర్నాటక సరిహద్దు వివాదం తేలే వరకు ఎలాంటి మైనింగ్‌కు అనుమతులు ఇవ్వవద్దని తెలిపింది. సుప్రీం కోర్టు అనుమతులు లేకుండా బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్ లైసెన్సులు ఇక నుండి జారీ చేయవద్దని తెలిపింది. కేవలం 16 కంపెనీలకు మాత్రమే మైనింగ్ చేసుకునేందుకు అనుమతినివ్వవచ్చని తెలిపింది. ఈ మూడు జిల్లాల్లో మైనింగ్ కోసం బిడ్ వేస్తే సుమారు రూ.50వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తాయని, భారీ ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశముందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+