అసంతృప్తి నిజమే, చిరంజీవి ఐతే తప్పేం లేదు: బొత్స

మంత్రులపై ఎవరూ లేని పోని ఆరోపణలు చేయవద్దని ఆయన ఐఏఎస్ అధికారులకు సూచించారు. అంశాల వారీగా పేర్కొని అక్రమాలకు బాధ్యులెవరో చెప్పాలన్నారు. మంత్రులపై విమర్శలు చేస్తున్న అధికారులు ఏ మంత్రి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విధాన నిర్ణయాలకు కేబినెట్ తప్పకుండా బాధ్యత వహిస్తుందని చెప్పారు. అయితే తెరవెనుక జరిగే వాటితో కేబినెట్‌కు సంబంధం లేదన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో అత్యధికంగా బలహీనవర్గాలు, దళితులకు చోటు కల్పించినట్లు చెప్పారు. రాబోయే కాలంలో తెలంగాణకు రావాల్సిన ప్రాతినిథ్యం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. చిరంజీవి సిఎల్పీ నేత ఉప నేత అయితే తప్పేమిలేదని అన్నారు.












Click it and Unblock the Notifications