వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏదో ఒకటి తేల్చండి: జగన్ వర్గం ఎమ్మెల్యే డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gurnath Reddy
అనంతపురం: కాంగ్రెసు ప్రభుత్వం తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా తాము విప్ ధిక్కరించి ఓటు వేశామని, మాపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెసు విప్ కూడా ఫిర్యాదు చేశారని మీకు చేతనైతే మాపై అనర్హత వేటు వేయండి లేదంటే తమను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులుగా గుర్తించండని కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజల సాక్షిగా తాము ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి ఓటు వేశామన్నారు. ఆ సమావేశం కూడా స్పీకర్ అధ్యక్షతనే జరిగిందని, తాము విప్ ధిక్కరించడం మా అభిప్రాయాలు కూడా చెప్పామన్నారు. అనర్హత వేటు వేయండి లేదా తమను జగన్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించి సభలో ప్రత్యేక స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఒంటిచేత్తో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెసుకు అధికారం కట్టబెట్టారన్నారు. ఇవాళ కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం గద్దెనెక్కాడానికి వైయస్ రెక్కల కష్టమే కారణమన్నారు. వైయస్ మృతి చెందిన తర్వాత ఆయన కుటుంబాన్ని, జగన్‌ను ఎలా అభాసుపాలు చేయాలి, ఎప్పుడు అరెస్టు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పని చేస్తున్నారని విమర్శించారు. వైయస్ పథకాలు కిరణ్ సర్కారు నీరుగారుస్తోందన్నారు. తమపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని, తద్వారా తమ ప్రభుత్వం కూలిపోతుందని కాంగ్రెసు భయపడుతోందని అందుకే స్పీకర్ తమపై అనర్హత వేటు వేయకుండా ఒత్తిడి తెస్తున్నారన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mla Gurnath Reddy challenged speaker Nadendla Manohar about Disqualification issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X