ఆ ఖలేజా చాలామందిలో అరుదుగా ఉంటుంది: జగన్

రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. సర్కారు డబ్బు కట్టలేక పోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి ప్రతిపక్షం, అధికార పక్షం కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టింది తనను, తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేందుకేనన్నారు. తనకు మద్దతిచ్చిన ఎమ్మెల్యేల్లో పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు ఉన్నారన్నారు. బాబూరావు చూపిన ఖలేజా చాలామందిలో అరుదుగా ఉంటుందన్నారు. త్వరలో వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, టిడిపిలు ఒక్కటయి రాజకీయాలు చేస్తాయని ఆరోపించారు. ప్రజలు, రైతులు, రైతు కూలీలు ఆలోచించి ఓటేయాలన్నారు.












Click it and Unblock the Notifications