చిరంజీవికి శాసనసభా పక్ష ఉప నేత పదవి ఖరారు

తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారికి శాసనసభలో వెనక సీట్లు కేటాయిస్తారు. చిరంజీవి శానససభకు తొలిసారి ఎన్నిక కావడం వల్ల విలీన ప్రక్రియ పూర్తయితే వెనక సీట్లోకి వెళ్లాల్సి వస్తుంది. దీన్ని నివారించడానికే కాకుండా చిరంజీవికి తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి ఆయనను శాసనసభా పక్ష ఉప నేతగా ప్రకటించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్నప్పుడు జె గీతా రెడ్డిని శాసనసభా పక్ష ఉప నేతగా నియమించారు. రోశయ్య ఎమ్మెల్సీ కావడంతో ఆ పని చేశారు. ఇప్పుడు మాత్రం చిరంజీవికి తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి మాత్రమే ఆ పదవిని భర్తీ చేస్తున్నారు.
శానససభా సమావేశాలు ఈ నెల 13వ తేదీన ప్రారంభవుతున్నాయి. 13వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. దీనికి ముందే చిరంజీవిని శానససభా పక్ష ఉప నేతగా ప్రకటించే ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications