కెసిఆర్! ఖబడ్దార్, బుక్క ఫకీర్ వేషాలు వద్దు: ఎర్రబెల్లి

తెలంగాణను మోసం చేసిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఆ పార్టీని కెసిఆర్ ఏ రోజు కూడా విమర్శించలేదని, పార్లమెంటులో తెలంగాణ గురించి మాట్లాడలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై కూడా ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేయడం మానుకోవాలని, కెసిఆర్‌కు తొత్తుగా వ్యవహరించడం మానుకోవాలని ఆయన కోదండరామ్‌కు సూచించారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఒక్క త్యాగమైనా చేశాడా అని ఆయన అడిగారు. తెలంగాణ వచ్చే వరకు ఎన్నికల్లో పోటీ చేయవద్దనే తమ సూచనకు అంగీకరించాలని ఆయన అన్నారు. తెలంగాణ పేరు చెప్పుకుని కెసిఆర్ బతుకుతున్నారని, తెలంగాణ పేరుతో కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆస్తులు సంపాదించుకున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.












Click it and Unblock the Notifications