వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హామీలను చిత్తుకాగితంతో పోలుస్తూ చించేసిన రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
లక్నో: ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ బుధవారం బహుజన్ సమాజ్ వాది, సమాజ్ వాది పార్టీల వాగ్ధానాలను చిత్తు కాగితంతో పోలుస్తూ చించి వేశారు. లక్నో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఓ కాగితం చించేశారు. ముఖ్యమంత్రి మాయావతి, ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ల వాగ్ధానాలను రాహుల్ చిత్తు కాగితంతో పోల్చారు. విద్యుత్తు, నీరు, ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగభృతి ఇస్తామని వాగ్ధానాలు చేయడం పేపరు మీద రాతల్లాంటివేనంటూ విపక్షాలపై విరుచుకు పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయలేని వాగ్ధానాలు ఇలాంటి కాగితంతో సమానం అంటూ చేతిలోని పేపర్‌ను చించేశారు. ఆ తర్వాత సభను ఉద్దేశించి మీకు అర్థమైందా అని అడిగారు. కేవలం వాగ్ధానాల వల్లే ఏమీ కాదని, అందుకే తాను వాగ్ధానాలు చేయడానికి రాలేదన్నారు.

ములాయం, మాయావతిలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. వారిద్దరు అధికారంలోకి రావడానికి వాగ్ధానాలు చేస్తున్నారని, కానీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఎందుకు నెరవేర్చలేదన్నారు. అవినీతి అంటున్న వారికి కర్నాటక, ఉత్తర ప్రదేశ్‌లలోని అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్ఆర్‌హెచ్ఎం క్రింద కోట్లాది రూపాయలు మిస్ అయ్యాయని దీనిపై ముఖ్యమంత్రిని ప్రజలు నిలదీయాలని సూచించారు.

English summary
Congress leader Rahul Gandhi tears up a paper, purported to be a list of promises being made by the BSP and SP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X