హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తీరు మారని సభ: 3రోజుల సెలవు తర్వాతా వాయిదాలే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: మూడు రోజుల సెలవు తర్వాత మంగళవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ అర్ధగంట వాయిదా పడింది. ఎప్పటిలాగే పట్టుమని పది నిమిషాలు కూడా నడవకుండానే విపక్షాల రాద్దాంతం నడుమ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను వాయిదా వేశారు. తెలంగాణపై తీర్మానం చేయాలని భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. మద్యం సిండికేట్లతో సంబంధం ఉన్న మంత్రులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. సభ్యులు పోడియం వద్దకు దూసుకు పోయారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కాగా అంతకుముందు మద్యం సిండికేట్లపై చర్చించాలని తెలుగుదేశం, తెలంగాణపై తీర్మానం చేయాలని, ఉద్యోగులపై వేధింపులు ఆపాలని బిజెపి, టిఆర్ఎస్, మాజీ ఎంపి మధుపై దాడి చేసిన మజ్లిస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం, అంబేడ్కర్ విగ్రహాల కూల్చివేతపై సిపిఐ వాయిదా తీర్మానం ఇచ్చాయి. విపక్షాల అన్ని తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.

కాగా అసెంబ్లీ వాయిదా పడ్డ అనంతరం మీడియా పాయింట్ వద్ద టిఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్ తదితరులు మాట్లాడారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు సభను జరగనివ్వమని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటపై నిలబడాలన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి బుద్ది చెబుతారని హెచ్చరించారు. విద్యార్థులపై కేసులు పెట్టడానికి కారణం మాట ఇచ్చి తప్పిన కాంగ్రెసు, టిడిపిలేనని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఈ పార్టీలకు ప్రజలు పాతరేస్తారని వారు అన్నారు.

English summary
Speaker Nadendla Manohar adjourned Assembly for half an hour today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X