చిరంజీవి కాంగ్రెసు కంపులో కలిశారు: చంద్రబాబు

తమ పార్టీని దెబ్బ తీయాలని కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తోందని, తమ పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నించేవారే మనుగడ కోల్పోతారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీతో తాము ఎప్పుడూ రాజీ పడలేదని, రాజీ పడబోమని ఆయన చెప్పారు. ముప్పయి ఏళ్లుగా తాము కాంగ్రెసుపై పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.
సమాచార హక్కు కమిషనర్ల పేర్లు మార్చాలని తాను సూచించినా అదే ఫైలును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్‌కు పంపించారని, గవర్నర్ దాన్ని తిప్పికొట్టారని ఆయన అన్నారు. సమాచార కమిషనర్ల ఎంపికను తాను వ్యతిరేకించానని, అయితే ఏకగ్రీవంగా జరిగిందని ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేసుకున్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు తీసుకున్న ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్లలో భాగస్వాములైనవారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications