గనుల కేసు: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై నేడు చార్జీషీట్?

సోమవారం శివరాత్రి కావడంతో మంగళవారం ఉదయాన్నే అనుమతి లభిస్తుందని ఎదురు చూస్తున్నారు. అక్కడ అనుమతి లభించిన వెంటనే ఇక్కడి అధికారులు చార్జిషీట్ కోర్టుకు సమర్పించే అవకాశముంది. ఒకవేళ ఈ రోజు అనుమతి లభించని పక్షంలో బుధవారం దాఖలు చేయవచ్చునని తెలుస్తోంది. కాగా శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. గాలి అక్రమ మైనింగ్ కుంభకోణంలో శ్రీలక్ష్మి కూడా నిందితురాలేనని పేర్కొంటూ గత ఏడాది నవంబర్ 28వ తేదీన సిబిఐ ఆమెను అరెస్టు చేసింది. తర్వాత ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చార్జిషీటులో పేర్కొన్న అభియోగాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈనేపథ్యంలో శ్రీలక్ష్మి బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది.












Click it and Unblock the Notifications