వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదాయానికి మించి ఆస్తులు!: శ్రీలక్ష్మికి కొత్త చిక్కులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Srilaxmi
న్యూఢిల్లీ: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై చార్జీషీట్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని సిబిఐ మంగళవారం సుప్రీం కోర్టును కోరింది. తనకు బెయిల్ ఇవ్వాలని శ్రీలక్ష్మి ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు విచారణ జరిపింది. ఇరువైపుల లాయర్ల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణనను ఈ నెల 27కు వాయిదా వేసింది. శ్రీలక్ష్మిపై చార్జిషీట్ 60 రోజుల్లో దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ సిబిఐ అధికారులు ఇంకా దాఖలు చేయలేదని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది వాదించారు. అందుకు సిబిఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ శ్రీలక్ష్మి కేవలం గాలి గనుల కేసులో అక్రమాలకు పాల్పడటమే కాకుండా అదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పారు. ఆమెపై 90 రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేయవచ్చునని, అందుకు మార్చి 31 వరకు తమకు అవకాశముందని చెప్పారు. శ్రీలక్ష్మి కోరుతున్నట్లు బెయిల్ ఇవ్వవద్దని సుప్రీం కోర్టును సిబిఐ విజ్ఞప్తి చేసింది. ఆమెను మరోసారి విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు. దీంతో కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

కాగా గాలి గనుల కేసులో అరెస్టైన శ్రీలక్ష్మి కేసు మలుపు తిరగడం గమనార్హం. ఓఎంసి కేసులో అక్రమాలకు పాల్పడటంతో పాటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఆమెను కొత్త చిక్కులు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. గనుల కేసు నుండి ఆదాయానికి మించి ఆస్తులకు మలుపు తిరగడం గమనార్హం. కాగా శ్రీలక్ష్మికి సంబంధించిన కేసు డైరీ, స్టేటస్ రిపోర్టును సిబిఐ సుప్రీంకు సమర్పించింది. కాగా గత నవంబరు ఆఖరు వారంలో అరెస్టైన శ్రీలక్ష్మికి డిసెంబర్ 2వ తేదిన బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈరోజు విచారించిన కోర్టు 27కు వాయిదా వేసింది.

English summary
It seems, IAS officer Srilaxmi may souped in another case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X